కావలసినవి: పుట్టగొడుగులు: అరకిలో, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి,అల్లంవెల్లుల్లి: టీస్పూను, వెల్లుల్లి: 4 రెబ్బలు,పచ్చిమిర్చి: ఒకటి, దనియాలపొడి: టీస్పూను, కారం:అరటీస్పూను, పసుపు:చిటికెడు, గరంమసాలా: చిటికెడు, నూనె: టేబుల్‌స్పూను,ఆవాలు:పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలు: టీస్పూను, జీలకర్ర: పావుటీస్పూను, నిమ్మరసం: అరటీస్పూను, కొత్తిమీర: కట్ట
తయారుచేసే విధానం : వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా నూరి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక కోసిన పుట్టగొడుగుల ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించాలి. అవి ఉడికిన తరవాత పసుపు, కారం, దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరవాత మూత తీసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ ఉడికించాక మిరియాల మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర తురుము చల్లి దించాలి.