కావలసిన పదార్థాలు: ఆపిల్ తురుము - రెండు కప్పులు, కొబ్బరి తురుము - ఒక కప్పు, డైఫ్రూట్స్ - 20గ్రా, నెయ్యి - 50గ్రా, పంచదార - ఒక కప్పు, పాలు - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం: కొద్దిగా నేతిలో డ్రై ఫ్రూట్స్ దోరగా వేగించి పక్కకు తీసుకోవాలి. మరుగుతున్న పాలలో పంచదార, ఆపిల్ తురుము, కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడుతున్నపుడు వేగించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి సన్నని మంటమీద మరో పదినిమిషాలు ఉంచి దించేయాలి.