కావల్సినవి: నానబెట్టుకున్న బియ్యంతో చేసిన పిండి - కప్పు, బంగాళాదుంప ముద్ద - అరకప్పు (రెండు బంగాళాదుంపల్ని ఒక కూత వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి), నీళ్లలో నానబెట్టిన సెనగపప్పు - టేబుల్‌స్పూను, గింజలు తీసేసిన ఎండుమిర్చి పొట్టు - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: ఓ గిన్నెలో బియ్యప్పిండీ, బంగాళాదుంప ముద్దా, నానబెట్టిన సెనగపప్పూ, ఎండుమిర్చి పొట్టూ, తగినంత ఉప్పూ, టేబుల్‌స్పూను కాచిన నూనె వేసుకుని బాగా కలపాలి. అందులోనే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపి పిండిని పదిహేను నిమిషాలు నాననివ్వాలి. తరవాత ఈ పిండిని చెక్కల్లా తట్టుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది. ఇవి కరకరలాడుతూ ఉంటాయి. పదిహేను రోజులవరకూ నిల్వ ఉంటాయి.