కావలసిన పదార్థాలు : బియ్యంపిండి - అరకిలో, శనగపప్పు- కప్పు, పెసరపప్పు- కప్పు, పచ్చిమిర్చి - ఐదు, వెన్న- ఐదు స్పూన్స్, జీలకర్ర -స్పూన్, కరివేపాకు- రెమ్మ, అల్లం- చిన్నముక్క, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం: శనగపప్పు,పెసరపప్పు అరగంట ముందు నానపెట్టాలి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మెత్తగా నూరుకోవాలి. ఒక గిన్నెలో బియ్యంపిండి, వెన్న కలిపి నానిన పప్పులు, అల్లం, పచ్చిమిర్చి ముద్దా, ఉప్పు వేసి, తగినన్ని నీళ్ళుపోసి కలపాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న, చిన్న ఉండలు చేసుకుని అప్పడాల్లా చేత్తో వత్తుకోవచ్చు. లేకపోతే పూరీప్రెస్తో వత్తుకొని నూనెలో వేయించుకోవాలి. అంతే చెక్కలు రెడీ.
చెక్కలు
