కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు-1/2 కిలో
పంచదార- 1/2 కిలో
నెయ్యి-1/2 కప్పు
యాలకులు- 4
కిస్మిస్లు-4
జీడిపప్పులు-4
తయారుచేసే విధానం
బాగా ఎండిన మొక్కజొన్న గింజల్ని సన్నని మంటపై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వత మిక్సీలో వేసి పొడి చేయాలి. పలుకులు లేకుండా ఉండేందుకు జల్లెడతో జల్లించి పంచదార పొడిని ఈ పిండిలో కలపాలి. యాలకుల పొడి, నెయ్యి, కూడా వేసి బాగా కలిపి ఉండలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్పై కొద్దిగా నెయ్యివేసి జీడిపప్పును బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. జొన్న లడ్డూలని వేయించిన జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించి అతిధులకందించంది.
జొన్న లడ్డు
