కావలసినవి : మినపప్పు-ఒక కప్పు, జీలకర్ర- అర టీస్పూను, ఉప్పు-తగినంత, నూనె-సరిపడా, పచ్చిమిర్చి-మూడు, జీలకర్ర- ఒక టీస్పూను, అల్లం- చిన్నముక్క.
తయారీవిధానం : మినపప్పును నీళ్లల్లో నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తర్వాత అందులోని నీళ్లను వంపి పప్పును గ్రైండ్ చేయాలి. మినప్పిండిలోనే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లో తీసుకుని ప్లాస్టిక్ షీటుపై లేదా, నేత గుడ్డపై లేదా పెద్ద ప్లేటులో వడియాల్లా పెట్టి రెండు రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఎండిన వడియాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. పప్పుచారులోనే కాదు పచ్చడన్నంలో కూడా మినప వడియాలు టేస్టీగా ఉంటాయి.