కావల్సినవి: చింతచిగురు - కప్పు, పల్లీలు - ఒకటిన్నర టేబుల్‌స్పూను, ధనియాలు, సెనగపప్పు - రెండు చెంచాల చొప్పున, ఎండుమిర్చి - పది, వెల్లుల్లి రెబ్బలు - మూడు, నూనె - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత.
తయారీ: చింతచిగురును శుభ్రంగా కడిగి తడిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి పల్లీలూ, ధనియాలూ, ఎండుమిర్చి, వెల్లుల్లిరెబ్బలూ, సెనగపప్పూ వేసుకోవాలి. అన్నీ వేగాక ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి చింతచిగురును వేయించుకుని తీసుకోవాలి. తాలింపును మిక్సీ జారులోకి తీసుకుని తగినంత ఉప్పు చేర్చి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత వేయించిన చింతచిగురు కూడా వేసి పొడిలా చేసుకుంటే సరిపోతుంది. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది.