కావాల్సినవి : చికెన్ - పావుకేజీ, చింతచిగురు - పావుకేజీ, కొబ్బరి తురుము - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - కట్ట, ధనియాల పొడి - టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూన్, ఆవాలు - టీస్పూన్, పుదీనా - కట్ట, ఉల్లిపాయలు - రెండు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, గరంమసాల - టీస్పూన్.
తయారీ : ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాన్ తీసుకొని నూనె వేసి, కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత జీలకర్ర వేసుకోవాలి. కాసేపయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరి కాసేపు వేగించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేయాలి. కాసేపటి తరువాత చికెన్ వేసి ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికిన తరువాత చింతచిగురు వేసి మరి కాసేపు ఉడికించాలి. చివరగా గరంమసాల వేసుకొని దింపుకోవాలి.