కావలసినవి : హాకా నూడుల్స్: పావుకిలో, ఉల్లికాడలు: 2 టేబుల్‌స్పూన్లు, క్యారెట్: ఒకటి, బీన్స్: నాలుగు, క్యాబేజీ: చిన్నముక్క, పుట్టగొడుగులు: నాలుగు, క్యాప్సికమ్: ఒకటి, సోయాసాస్: టేబుల్‌స్పూను, వినెగర్: టీస్పూను, చిల్లీ సాస్: టీస్పూను, మిరియాలపొడి: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు: రెండు
తయారుచేసే విధానం : బాణలిలో నీళ్లు పోసి మరిగించి నూడుల్స్ వేసి ఉడికించి ఆ నీళ్లన్నీ వంపేసి చల్లని నీళ్లతో కడిగితే విడివడతాయి. కూరగాయలన్నీ సన్నని ముక్కల్లా తరిగి ఉంచాలి. చిన్న గిన్నెలో వినెగర్, సాస్ వేసి కలపాలి. బాణలిలో నూనె వేసి కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత ఉల్లికాడలు, క్యారెట్‌ముక్కలు వేసి కాస్త వేగాక పుట్టగొడుగులు, బీన్స్‌ముక్కలు వేయించాలి. క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు కూడా వేసి వేగాక సాస్మిశ్రమం వేసి కలపాలి. ఉడికించి చల్లార్చిన నూడుల్స్ వేసి కలిపి మిరియాలపొడి వేసి ఓ రెండు నిమిషాలు వేయించి దించితే సరి.