- 'మనూ'లో 57 పోస్టులు
- హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
(ఎంఏఎన్‌యూయూ-మనూ) వివిధ విభాగాల్లోని టీచింగ్, నాన్‌టీచింగ్, అకడమిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా హైదరాబాద్‌తోపాటు, శ్రీనగర్‌లోని 'మనూ' ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (మహిళలు)లోని ఖాళీలనూ భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు : 57
పోస్టుల పేరు-ఖాళీలు : ప్రొఫెసర్-11, అసోసియేట్ ప్రొఫెసర్-25, అసిస్టెంట్ ప్రొఫెసర్-8, డెరైక్టర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)-1, అసిస్టెంట్ డెరైక్టర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)-1, అసిస్టెంట్ రీజనల్ డెరైక్టర్-1, పీజీటీ (ఇంగ్లీష్)-1, టీజీటీ (ఇంగ్లీష్)-2, ఫిజికల్ ఎడ్యుకేషన్-1, వర్క్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ (ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అండ్ ఎలక్ట్రానిక్స్)-1, సాయింగ్ నీడిల్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ-1, యోగా టీచర్-3, లోయర్ డివిజన్ క్లర్క్-1.
వేతనం : పోస్టులు, నిబంధనలు, అర్హతలను అనుసరించి
అర్హతలు : సంబంధిత పోస్టులను అనుసరించి పీహెచ్డీ/ ఎంబీఏ/ సీఏ/ సీడబ్ల్యూఏ/ కంపెనీ సెక్రటరీ/ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీఎం/ బీఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ డిప్లొమా. దీంతోపాటు ఉర్దూ భాషా పరిజ్ఞానం, తదితరాలు ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు : టీచింగ్, అకడమిక్ పోస్టులకు రూ.500 (జనరల్/ ఓబీసీ), మోడల్ స్కూల్ టీచర్స్ పోస్టులకు రూ.300 (జనరల్/ ఓబీసీ). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ : అక్టోబర్ 16, 2017.
పూర్తి వివరాలు : వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్ : www.manuu.ac.in
ఉద్యోగాలు
