- ఎస్సెస్సీలో 1102 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
భారత వాతావరణ విభాగం (మెటిరియోలాజికల్ డిపార్ట్మెంట్)లోని 1102 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి 'రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్, 2017' నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది.
పోస్టుపేరు : సైంటిఫిక్ అసిస్టెంట్
వేతనం : రూ.9,300-34,800ంజీపీ రూ.4,200.
అర్హతలు : ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు డిగ్రీ(సైన్స్-ఒక సబ్జెక్టు కచ్ఛితంగా ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్) 60 శాతం మార్కులు/ 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత.
వయోపరిమితి : 2017 ఆగస్ట్ 4 నాటికి 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : 'రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్, 2017' ద్వారా మెరిట్ జాబితా తయారీ.
పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. వ్యవధి రెండు గంటలు. ప్రశ్నాపత్రం పార్ట్-1, పార్ట్-2 భాగాలుగా ఉంటుంది. పార్ట్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25, ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-25, జనరల్ అవేర్నెస్-25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-2లో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంశాలపై 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 0.25 చొప్పున నెగిటివ్ మార్కు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగ/ మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్ట్ 4, 2017.
వెబ్సైట్: www.ssconline.nic.in, www.ssc.nic.in
ఉద్యోగాలు
