సన్నాసులు అధికారంలోకి వస్తే ఎలా ఉంటారు?
సన్నాసుల లాగానే ఉంటారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి తీరు చూసిన ప్రతిసారీ ఇదే నిజం అనిపిస్తూ ఉంటుంది.
ఇటీవల యుపిలోని ఒక ప్రాంతంలో కోతులు తమపై దాడులు చేస్తున్నాయని, రక్షణకు ఏర్పాట్లు చేయండని జనం ఆయన్ని కోరారట!
ఇంకేముంది ఆ 'యోగి' ఇలా సెలవిచ్చాడు...
'రోజూ హనుమాన్ చాలీసా చదవండి. భజనలు చేయండి. కోతులు మిమ్మల్ని ఏమీ చేయవు..' అని.
దీంతో 'సన్నాసి ముఖ్యమంత్రి అయ్యాక
ఇంతకుమించి ఏం చెప్తాడులే ..' అని అక్కడ వున్న జనం చెవులు కొరుక్కున్నారట!
ఇక మన రాష్ట్రంలోనూ ఇదే తంతు.
ఈ మధ్య తూర్పు గోదావరి జిల్లాలో పాము కాట్లు ఎక్కువయ్యాయి.
దానికి కారణం తెలుసుకొని, శాస్త్రీయ పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం, 'సర్ప శాంతి యాగం' జరిపించింది.
మరి పాములు శాంతించాయా అంటే.
యాగం చేసిన సంగతి పాములకు తెలీదు కదా!
ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. కాటేస్తూనే ఉన్నాయి.
ఇలా వుంది మన పాలకుల తీరు.
బిజెపితో అంట కాగాక
అంటకూడని జబ్బులు చాలానే అంటుకుంటాయి.
ఆ వాస్తవం మనకు తెలుస్తూనే వుంది.
'అసలు' వాళ్లకే తెలియడం లేదు పాపం.
సన్నాసులతో స్నేహం
