ముగిసిన టెన్నిస్ నేషనల్ సిరీస్ టోర్నమెంట్
ప్రజాశక్తి -కావలి
పట్టణంలో గత 6 రోజులుగా హోరాహోరీగా జరుగుతున్న డి.ఆర్ మొ మోరియల్ విట్స్, నేషనల్ సిరీస్ అండర్-18 టెన్నీస్ టోర్నమెంట్ శనివారంతో ముగిసింది. చివరి రోజున జరిగిన బాలికల సింగిల్స్‌లో సంస్కృతి దమేరా (తెలంగాణ) జట్టు తన్వికశ రవణన్ (తమిళనాడు)పై పైనల్స్‌లో ఆడి 7-5, 6-3 స్కోరుతో ఘనవిజయం సాధించింది. బాలుర సింగిల్స్‌లో ఉదిత్గొగై (అస్సాం) ఫైనల్స్‌లో అమన్ ఆయూబ్ ఖాన్‌తో తలపడి 6-4, 6-4 స్కోరుతో ఘ నవిజయం సాధిం చింది. సింగిల్స్ విన్నర్స్‌గా గెలుపొంది నవారికి ఒక్కొక్కరికి రూ.25వేలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనుమోలుశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కావలి విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో టోర్నమెంట్ నిర్వహించడం అభి నందనీయమన్నారు. కావలి టోర్నమెంట్స్‌లో క్రీడా కారులకు భోజనసదుపాయం కల్పిం చడమే గాక విజేతలైన క్రీడాకారులకు రూ. 50.వేలు నగదు బహుమతి అంద జేయడం సంతోషకరమన్నారు.
ముగింపు సమావే శంలో టోర్నమెంట్ చైర్మన్ దొడ్ల విద్యాధర్‌రెడ్డి, చీఫ్ అంఫైర్ రామిరెడ్డి, చీఫ్ టెక్నికల్ అంఫైర్ డాక్టర్ ప్రసాద్‌రెడ్డి పాల్గొని విజేతలకు నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు.ఈ టోర్నమెంట్లో కీలకంగా ఎంఫైర్లు జోస ఫ్సుకుమార్, సిహెచ్ మణికంఠ, పరిశపోగు భాస్కరరావు, సునీల్, షరీఫ్, ఐ.మణికంఠ, చిన్నబాబు, ఏడు కొం డలు, విశ్వోదయ విదా ్యసంస్థల వాల ంటీర్లు, బాల్ బార్సుగా పనిచేసి క్రీడాకారుల నుంచి అభినందనలు పొందారు.
ముగిసిన టెన్నిస్ నేషనల్ సిరీస్ టోర్నమెంట్
