దళితుల హక్కుల సాధనలో కెవిపిఎస్ కీలక పాత్ర
ప్రజాశక్తి-గూడూరు
దళితులపై జరుగుతున్న వివక్షతను తొలగించేందుకు వారి హక్కుల సాధన రక్షణ కోసం కెవిపిఎస్ కీలక పాత్ర పోషించిందని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి వెల్లడించారు.శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలోని ఐ. జనార్దన్ రెడ్డి సమావేశ మందిరంలో రెండో రోజు కెవిపిఎస్ జిల్లా మహసభల్లో ప్రతినిధుల సమా వేశం జరిగింది.ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్షత నిర్మూలనకు కెవిపిఎస్ రూపొందిం దన్నారు. మొట్టమొదటగా నెల్లూరు జిల్లాలో పుచ్చలపల్లి సుందరయ్య తన పేర్లో రెడ్డిని తొలగించుకొని ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ రాష్ట్రంలో 1958-59లో కుల వివక్ష అత్యంత దారుణంగా ఉండినట్లు తెలిపారు.ఆ పరిస్థితులను తాము నాటి ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసి పరిస్థితిని వివరించి పరిష్కరిం చాలని కోరామన్నారు.రాష్ట్రంలో కుల వివక్షే లేనట్లుగా తమ మాటలను అవహేళనగా తీసుకున్నట్లు తెలిపారు. తాను ఉద్యమాన్ని చేపట్టి సమస్యలను ఆయన దృష్టికి తీసుకోపోగా విషయం తెలుసుకున్న బాబు 2000సంవత్సరంలో జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను వేశార న్నారు.ఆయన 1993పేజీల రిపోర్టును ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ఫలితంగా ఎస్సి,ఎస్టి కమిషన్ ఏర్పడిందన్నారు. ఆనంతరం దళితుల శ్మశానాల కోసం పోరాటాలు చేశామ న్నారు. 2004లో అందుకు ప్రభుత్వం జిఒ ఇచ్చిందన్నారు. సబ్‌ప్లాన్ కోసం పోరాటం చేశామ న్నారు.ఆ నిధులను పక్కదారి మళ్లించిన ఘనత అటు చంద్రబాబుకు, ఇటు వైసిపికి లేకపోలేదన్నారు. ఎట్టకేలకు 2013లో ఎస్సి,ఎస్టి చట్టం రాష్ట్ర ముఖ్య మంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో చట్టబద్దం జరిగిందని తెలిపారు.తిరిగి 2014లో అధికారంలోకి వచ్చిన బాబు ఎస్సి, ఎస్టి చట్టం పకడ్బందీగా అమలుచేస్తామన్నారు. సబ్‌ప్లాన్ నిధులతో దళిత వాడ అభివృద్ధి చేపడుతామన్నారు. ఆ నిధులను పొదుపు మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో చెక్కులు ఇచ్చేందుకు దారి మళ్లించా మన్నారు.ఎన్నికల్లో లాభపడేందుకే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు ఆరోపించారు. అంతేకాకుండా చివరి రాష్ట్ర బడ్జెట్లో 27శాతం నిధులు కేటాయిం చినట్లు అంకెల గారడి చేసి చూపించా రన్నారు. ఆయనకు దళితులపై ప్రేమ ఎలా ఉందంటే రాష్ట్రం మొత్తమ్మీద 15,000 ప్రభుత్వ బడులను మూయించి వేశారన్నారు. ఇక దళితుల ఆరాధ్య నాయకులైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహన్ని అమరావతిలో 18 అడుగుల ఎత్తున నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఒక్క అడుగు ముందుకు పోలేదన్నారు.
అంతేకాదు ఆ విగ్రహ నిర్మాణానికి నిధులు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపించడం శోచనీయంగా పేర్కొన్నారు. మొత్తం 13జిల్లాల్లో 8వేల ఎకరాల దళితుల భూములను బలవంతంగా లాగేసుకున్నా రన్నారు. ఎస్సిల పేరుతో కార్లకు రుణాలు ఇస్తున్నట్లు ఖరీదు చేసిన ఇన్నోవా కార్ల అన్నింటికి ఎంఎల్ఎ బినామీలుగా పేర్కొన్నారు.
కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిడిపి పాలనలో దళితులపై దాడులకు హద్దులేకుండా పోయిందన్నారు. ఇటీవల గూడూరు మున్సిపాలిటీ కమిషనర్ ఓబులేసు దళిత కులానికి చెందిన వారైనందున టిడిపి ప్రభుత్వంలో దాడి చేసి కులం పేరుతో దూషించా రన్నారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈనాటికి కారకులైన కౌన్సిలర్లను అరెస్టు చేయకపోవడం దారుణంగా పేర్కొన్నారు. దానిపై గూడూరు కెవిపిఎస్ నాయకులు పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కెవిపిఎస్ ఎప్పుడు దళితులకు అండగా ఉంటుందని వివరిం చారు.జరిగిన ప్రతినిధుల సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోను దయాకర్, జిల్లా నాయకులు ఆత్మకూరు.నాగయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్ యాదగిరి, జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య, కాల్తిరెడ్డి రమణమ్మ, జోగి శివకుమార్, ఎస్ ముత్యాలయ్య, తిరుపాలయ్య పాల్గొన్నారు.
దళితుల హక్కుల సాధనలో కెవిపిఎస్ కీలక పాత్ర
