స్థానిక మండల పరిధిలో ఉన్న నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీలో వి.రాజా మరణించిన విషయం ఫ్యాక్టరీ వర్కర్స్‌లో చైతన్యం కలిగించింది. ఈ నాడు అతనికి జరిగింది. రేపు వారికీ జరుగుతుందని ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కాలేదు. ఈ విషయంపై డిఎస్పి సూర్యనారాయణ యాజమాన్యంతో చర్చించి బాధితు లకు ఎటువంటి న్యాయం చేయాలో నిర్ణయం తీసు కున్నారు. దీనిపై మాజీ మంత్రి చెంగారెడ్డి కుమార్తె ఇందిర ప్రియదర్శిని బాధితులకు న్యాయం చేయాలని యాజమాన్యంతో పట్టుపడ్డారు. ఈ మేరకు యాజ మాన్యం బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయాలో చెప్పకుండా, వచ్చి పరిశీలించకుండా, ఎక్కడో ఉండి తమ ఫ్యాక్టరీ నిర్వహకులచే రూ.30 వేల రూపాయలను డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చెంగారెడ్డి చేతుల మీదుగా మృతుని భార్య విజయ, కుమార్తెలకు అంతిక్రియల కోసం ఇచ్చారు. గ్రామస్తులు ఇది అన్యాయమని తమకు కావాల్సిన బాధిత రొక్కం సుమారు 5 లక్షలు తప్పనిసరిగా ఇప్పించాల్సింది గా కోరారు. మునుపు షుగర్ ఫ్యాక్టరీలో పెయింటర్ చని పోయాడు. అతనికి ఏ విధంగా ఇప్పించారో అదే విధంగా రాజా కుటుంబానికి ఖచ్చితంగా సాయం చేస్తామని మాజీ చెంగారెడ్డి తమ కుమార్తె, డిఎస్పీ హామి ఇచ్చారు. నిండ్ర గ్రామ ప్రజలు, కొప్పెడు ప్రజలు మరి కొందరు సంతాపం తెలిపారు. ఫ్యాక్టరీ వర్కర్స్ తమ తోటి చనిపోయిన వర్కర్‌ను చూడ్డానికి అనుమతి ఇవ్వక పోవడం చాలా దురదృష్టకరమన్నారు. అనంతరం డిఎస్పీ సూర్యనారాయణ, నిండ్ర ఎస్ఐ రవి, విజయ పురం ఎస్ఐ ప్రసాదరావు రాజా మృత దేహాన్ని ఫ్యాక్టరీ నుండి తరలించమని చెప్పడంతో గ్రామ ప్రజలు తరలించారు. దీనిపై నిండ్ర పోలీస్ స్టేషన్ ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తానన్నారు.
నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం
