ప్రజాశక్తి - నెల్లూరు
రిచ్ చిన్న పిల్లల వైద్యశాలలో ఈ నెల 9వ తేదిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ టి.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలోని సమావేశ మందిరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చిన్నపిల్లల మానసిక సమస్య లు, ఎడిహెచ్డి, ఆటిజం సమస్యలకు ఈ వైద్యశిబిరంలో డాక్టర్లు సేవలందిస్తారన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక సెల్ఫోన్లు వినియోగం, ఇంటర్నెట్ వినియోగం తదితర అంశాలతో చిన్న వయస్సులోనే పిల్లలు మానసిక సమస్యలకు గురౌతున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్పాటు చేస్తున్న ఈ వైద్యశిబిరంలో పిల్లల ప్రవర్తన సమస్యలు, ఉద్వేగ సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలు, నలుగురిలో కలవలేకపోవడం, అతిగా ప్రవర్తించడం (ఎడిహెచ్డి), విద్యలో వెనకబడటం, ఏకాగ్రత లోపించడం, పాఠశాలకు వెళ్లక పోవడం, పరీక్షలంటే భయాందోళనకు గురికావడం, నిద్ర లేమి సమస్యలతో బాదపడటం వంటి సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్న ం 2 గంటల వరకు వైద్యశిబిరం నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు ఫోన్ 8886670 846 నెంబరును సంప్రదించాలన్నారు.
9న ఉచిత వైద్య శిబిరం
