సిపిఎం నాయకులు కోటేశ్వరరావు మృతి
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు
మండలంలోని కండ్లగుంట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచి పాలపర్తి కోటేశ్వరరావు(77) శుక్రవారం మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడు తున్నారు. సిసిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, సిపిఎం తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జిల్లా నాయకులు ఎస్కె.మాబు, జె.జయంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీకాంత్ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. కోటేశ్వర రావు 1964 నుంచి పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 1995లో సిపిఎం తరపున గ్రామానికి సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. శుక్రవారం సాయంత్రం కోటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహించారు.
సిపిఎం నాయకులు కోటేశ్వరరావు మృతి
