ప్రైమ్ కంపెనీలో కార్మికుల ఆకలి కేకలు
నాలుగు నెలలుగా అందని జీతాలు - కలెక్టర్ దృష్టికి సమస్యలు
ప్రజాశక్తి - నెల్లూరు
నాయుడుపేట ప్రాంతంలోని సెజ్ ఏరియాలోని ప్రైమ్ అనే ట్రాన్స్ఫార్మర్ల తయారు కంపెనీలో పనిచేస్తున్న సుమారు 150 మంది కార్మికులకు గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కార్మికుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ఆర్ ముత్యాల రాజుకు విన్నవిస్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో ఆ కార్మికులు మంగళవారం రకరకాల మార్గాల్లో నగరానికి చేరుకున్నారు. యాజమాన్యం కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా 'నోవర్క-నోపే' అనే నోటీసు బోర్డును పెట్టడంతో కార్మికులు షాక్ గురయ్యారు. ఈ విషయాన్ని కొందరు కార్మికులు సిఐటియు జిల్లా నాయకత్వానికి సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహన్‌రావు ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
కార్మికుల ఆవేదన ఇదీ..
ఈ సందర్భంగా కార్మికులు తమ బాధలను విలేకర్లతో ఎదుట వాb ోయారు. గడిచిన ఆరేళ్లుగా ఆ కం పనీలో పనిచేస్తు న్నామన్నారు. కంపెనీ యాజమాన్యం తమ జీతాల చెల్లింపుల నుంచి పిఎఫ్ ఖాతాలో జమ చేస్తున్నామంటూ ప్రతి నెలా జీతం నుంచి కొంత మొత్తాన్ని తీసు కుంటుందన్నారు. ఆ మొత్తానికి కంపెనీ యాజమాన్యం కొంత మొత్తం కలుపుకొని పిఎఫ్ ఖాతాలో జమచేయాల్సి ఉందన్నారు. ఆవిధంగా జమ కావడం లేదన్నారు. తమ తోపాటు కంపెనీలో పిసిఐ అనే విభాగం వారు కాంట్రాక్టు పద్ధతిలో ఈ కంపెనీలో విధులు నిర్వహిం చేందుకు 60 మంది కార్మికులను విధుల్లోకి తీసుకున్నారన్నారు. వీరికి జీతాలు చెల్లింపుల్లో కూడా పిఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు కొంత మొత్తాన్ని కంపెనీ ప్రతినిథులు తీసుకొని చెల్లించడం లేదన్నారు. కార్మికులకు పిఎఫ్ ఖాతాలు ఇప్పటి వరకూ ప్రారంభించలేదని ఆరోపించారు. జీతాలు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని కార్మికులు ప్రశ్నించడంతో నోటీ బోర్డులో 'నోవర్క- నో పే' అనే నోటీసు పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చామన్నారు.
ప్రైమ్ కంపెనీలో కార్మికుల ఆకలి కేకలు
