* రివర్స్ చదువు
వెంగళప్ప పెళ్ళి చూపులకెళ్ళాడు. అమ్మాయితో.....
వెంగళప్ప :నువ్వు ఎంత వరకు చదువుకున్నావ్??
స్వీటీ : బి.ఎ
వెంగళప్ప : నువ్వు చదివిందే రెండక్షరాలు అది కూడా రివర్స్లోనా....
* చీకటి ధ్యాస
తండ్రి : ఏరా ఈ రోజు పరీక్షకి బాగా చదివావా??
బంటి : ఒంటి గంట నుంచి మూడింటి దాకా నైటవుట్ చేసి మరీ చదివా నాన్నా...
తండ్రి : రాత్రి నాలిగింటి వరకు కరెంట్ పోయింది కదరా??
బంటి : చదువు ధ్యాసలో పడి కరెంట్ పోయింది కూడా చూసుకోలేదు నాన్నా....!!
తండ్రి : ఆ........!!
* మరీ అంత కాదు
ఫ్లయిట్లో రెండు దేశాల ప్రయాణీకులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
మొదటి వ్యక్తి : మా దేశస్తులు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే మేం టి.వి సెట్లని పగల కొట్టేస్తాం...తెలుసా!!
రెండో వ్యక్తి : మేం మరీ అంత కాదు.....
మొదటి వ్యక్తి : అంటే ఏం చేస్తారు...
రెండో వ్యక్తి : మరుసటి రోజు ఆ వార్త వచ్చిన న్యూస్ పేపర్ని చింపేస్తాం...!!!
* 8 కోస్తే...
టీచర్ : చంటి ఎనిమిదిలో సగం ఎంత?
చంటి : అడ్డంగా కోస్తే సున్నా......నిలువుగా కోస్తే మూడు టీచర్!!
* రాక్షసత్వం
తమ్ముడు : మీరు ఈ మధ్య మరీ రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకని?
అన్న : వారం క్రితం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తమేగా ఎక్కించింది!
* జిఎస్టి ప్రేమ
రవి : దీప్తి నీకు ఇష్టమైన వాటిగురించడిగితే ఎప్పుడూ నాపేరే చెబుతావు. అంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో కదా!
తనూ : 72 శాతం
రవి : అదేంటి 100 శాతం కాదా....??
తనూ : లగ్జరీ ఐటమ్స్పైన 28 శాతం జిఎస్టి వుందిగా!!....