మేధావి
చింటు: నేను కాఫీ కప్పులో కాఫీ చూపిస్తా నువ్వు వరల్డ్ కప్పులో వరల్డ్‌ని చూపించగలవా??
బంటి: అబ్బో...అయితే నేను క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ తింటాను. మరి నువ్వు టైగర్ బిస్కెట్లో టైగర్ని తినగలవా.
వెయిటేజ్
శ్రీను ఓ ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
మేనేజర్: ఏంటయ్యా మూడు నెలల్లో ఆరు ఉద్యోగాలు మారావు.
శ్రీను: నాకున్న డిమాండ్ అలాంటిది సార్.
ఉడతా సాయం
సుబ్బారావ్: మొన్న ఒక 300 మంది షిప్లో వెళుతూ చచ్చిపోయారట!
అప్పారావు:ఏం షిప్ నీళ్లలో మునిగిపోయిందా?
సుబ్బారావు: కాదు షిప్ నీళ్లలో ఆగిపోయింది. వీళ్లు నెట్టడానికి కిందకి దిగారట.
హోటల్ డాక్టర్
రమేష్: ఈ డాక్టర్ గతంలో ఏదైనా హోటల్లో పనిచేసి ఉంటాడని నా అనుమానం
సోమేష్: ఎలా చెప్ప గలవు?
రమేష్: ఇంజెక్షన్ చేయించుకున్నాక డబ్బులు లేవంటే క్లినిక్‌లో టవల్స్ గట్రా ఉతికించాడ్రా మరి.
కాలక్షేపం
ఇంటర్వ్యూ బోర్డ్‌లో ఒక మెంబర్: మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినా నీకు ఉద్యోగం రాలేదనుకో అప్పుడు నువ్వేమనుకుంటావ్??
రాము: ఈ పిచ్చి వెధవలతో కాసేపు కాలక్షేపం అయ్యింది అనుకుంటా.....!!
కిసుక్కు
బిట్టు: వురేరు... నీ గొడుగుకు చిల్లు పడింది...
చంటి: ఎండ తగ్గిందో లేదో తెలుస్తుందని నేనే పెట్టా!
బిట్టు: ఆ.......