* పనిష్మెంట్
సుశీల : లెక్చరర్కిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసాశారు అంది అమ్మతో...
తల్లి : ఏమైందమ్మా నిన్నేమన్నా వేధిస్తున్నాడా...??
సుశీల : నిన్న వంకాయ కూరలో ఉప్పు ఎక్కువ వేశానని పది సార్లు అదే కూర చేయమని చెప్పాడు.
* అతితెలివి
మొదటి వెంగళప్ప : నీకు తమ్ముడు పుట్టాడటగా ...
రెండో వెంగళప్ప : పుట్టింది నాక్కాదు మా అమ్మకు.
మొదటి వెంగళప్ప : ఓహో మీ అమ్మకు తమ్ముడు పుట్టాడా
* కిసుక్కు
టీచర్ : పరీక్షలో ఒక్కో ప్రశ్నకు సమయం పది నిమిషాలు మాత్రమే!
చింటు : మరి జవాబుకి టీచర్...?!
* అతిమరుపు
టీచర్ : చింటు బోర్డ్ మీద యాభై అయిదు అంకె రాయి.
చింటు బోర్డు వద్దకి వచ్చి ఏం రాయకుండా వుండిపోయాడు.
టీచర్ : ఐదు పక్కన ఐదు రాయి.
చింటు ఒక ఐదు రాసి అలా నిలబడిపోయాడు.
టీచర్ : అదేంటి ఏం రాయకుండా అలా నిలబడిపోయావ్.
చింటు : ఐదుకి ఏ పక్క ఇంకో ఐదు రాయాలో తెలీక ఆలోచిస్తున్నా.....
*కొత్త కుర్చీ
సుబ్బారావు : ఏంట్రా కొత్త కుర్చీ ఎప్పుడు కొన్నావ్?
వెంగళ్ : నేను కొనలేదురా.... నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళానా అక్కడ టేక్ యువర్ సీట్ అన్నారు. అందుకే ఇంటర్య్వూ అవ్వగానే నాతోపాటే తీసుకొచ్చేసా.
* దొంగ దొరికాడు
సుబ్బారావు : మీఇంట్లో పడిన దొంగను ఎలా పట్టుకున్నారు?
అప్పారావు : మేమెక్కడ పట్టుకున్నాం. తనే దొరికి పోయాడు.
సుబ్బారావు : అదేలా??
అప్పారావు : మా వంటింట్లోకి వెళ్లి ఆవకాయ జాడీ మూత తీశాడు... అంతే తుమ్మీ తుమ్మీ అక్కడే కూలబడ్డాడు.