న్యూఢిల్లీ : 26 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత కిరాతకంగా జరిగిన సామూహిక 'హత్యాచారాన్ని' పాశవిక చర్యగా నిర్భయ తల్లి ఆశాదేవీ అభివర్ణించారు. 2012లో ఢిల్లీలో ఆశాదేవీ కుమార్తె, పారామెడికల్ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు అనాగరికంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనినే నిర్భయ ఘటనగా పేర్కొంటున్నాం. తన కుమార్తె విషయంలో దోషులను వెంటనే శిక్షించాలని పోరాటం చేస్తున్నామని, ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆశాదేవి అన్నారు. కానీ 'దిశ' విషయంలో జాప్యం జరగకూడదని, వెనువెంటనే దోషులకు శిక్ష పడాలని పేర్కొన్నారు.
దిశకు త్వరగా న్యాయం జరగాలి : నిర్భయ తల్లి
