* రాహుల్‌కు మందలింపు
న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో గురువారం ఊరట లభించింది. ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం రాహుల్‌ను సున్నితంగా హెచ్చరించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ఆయన గతంతో స్పందిస్తూ మోడీని ఉద్దేశించి 'చౌకీదార్ చోర్‌హై' అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని బిజెపి నేత మీనాక్షి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు అపాదిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నా యని, ఆయన భవిష్యత్తులో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. తన వ్యాఖ్య లపై క్షమాపణలు చెబుతూ రాహుల్ గతంలో దాఖలు చేసుకున్న ఆఫడవిట్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో పాటు ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసును కూడా కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ ' మీరు రాజ కీయాల్లో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నారు. రాజకీయ అంశాలపై ప్రసంగాలిచ్చే సమయంలో న్యాయస్థానాలను అందులోకి లాగవద్దు' అని పేర్కొంది. రాహుల్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
కాస్త జాగ్రత్తగా మాట్లాడండి.!
