చెన్నై : మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సాహితో తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.పలనిస్వామి, అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సాహి తమిళనాడుకు బదిలీ అయ్యారు. అంతకుముందు ఇక్కడ ప్రధా న న్యాయమూర్తిగా పనిచేసిన తహిల్ రమణిని మేఘాలయకు బదిలీ చేశారు. తన బదిలీని పున:పరిశీలించాలన్న ఆమె విజ్ఞప్తిని కొలిజియం తోసిపుచ్చడంతో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎపి సాహి
