న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్తుకిపై సిబిఐ అధికారులు శుక్రవారం అక్రమార్జన కేసు నమోదు చేశారు. 2003లో తన సోదరుడికి ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు అవినీతికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. ఆయన రాష్ట్రంలో వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో రూ.3.20 కోట్ల కాంట్రాక్టును టెండర్ ప్రక్రియ చేపట్టకుండా తన సోదరుడు నబామ్ తగామ్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆ సమయంలో పౌరసరఫరాల డైరెక్టర్‌గా ఉన్న తగామ్పై, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సొహ్రబ్ అలి హజారికాలపై కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 2011-16 మధ్యకాలంలో నబామ్ తుకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సిఎంపై సిబిఐ కేసు
