- క్షీణిస్తున్న ఉపాధి ... నిరుద్యోగానికి రెక్కలు
- కాషాయీకరణే ఎజెండా
- ఎంవిఎస్ శర్మ
అరుణ్‌జైట్లీ గారు మన ఆర్థిక వ్యవస్థ బహు బాగా ముందుకు దూసుకుపోతుందని సంబరం వ్యక్తం చేస్తున్నారు. మరి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఏజెంట్లు ఏమంటున్నారు? '' అత్యున్నత స్థాయి ఆదాయాలు సంపాదించే బహు కొద్ది మందికి అపారమైన సంపదలు చేకూర్చగలిగారు తప్ప కోట్లాది మంది మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి ఏమి ఒరగలేదు'' అని బ్రిటీష్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో వాణిజ్య విభాగ మాజీ కార్యదర్శి జిమ్ ఒనీల్ అన్నారు. (గోల్డ్ మాన్ సాచ్స్ అనే అంతర్జాతీయ దిగ్గజ ఆర్థిక సంస్థలో ఈయన మాజీ ఉద్యోగి) జిమ్ ఒనీల్ ప్రకటన బట్టి అతగాడికి పేద ప్రజలున్నారని గానీ, వారిగురించి ఆలోచించాలని గానీ స్పృహ లేదన్నది తెలుస్తూనే ఉంది. అది పక్కన బెడితే షేర్ మార్కెట్లలో మదుపరులు, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేల్ లాంటి రంగాల కస్టమర్లలో ఈ మధ్యతరగతి వారే అత్యధిక శాతం, అందువల్లనే వారిపై జిమ్ ఒనీల్ గారికి అభిమానం. ఉపాధి అవకాశాలు పెరగనిదే మన ఆర్థిక వ్యవస్థ ముందుకు పోలేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఇఎ) అనే పరిశోధనా సంస్థ స్పష్టం చేసింది. రైల్వేల్లో 90 వేల ఉద్యోగాలకు 2 కోట్ల 80 లక్షల మంది అభ్యర్థులు( ఒక్కొక్క ఉద్యోగానికి 300 మంది పోటీ పడుతున్నారన్నమాట) దరఖాస్తులు చేశారు.
- జపాన్‌లో ప్రజల సగటు వయస్సు 47 సంవత్సరాలు. చైనాలో ఇది 37 సంవత్సరాలుగా ఉంటే మనదేశంలో 22. మనదేశానికి ఉన్న ఈ సానుకూల అంశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలం అవుతోంది. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న మోడీ ఇప్పుడు చారు దుకాణాలు, పకోడీ బడ్డీలు పెట్టుకోమని సలహాలిస్తున్నారు. నోట్ల రద్దు కరారణంగా వెంటనే 1 కోటి 50 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, జిఎస్టి ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయంలో, అనుబంధ రంగాల్లో, భవన నిర్మాణ రంగాల్లో ఉపాధి కల్పనా శక్తి తీవ్రంగా దెబ్బతిన్నదని సిఎంఐఇ నివేదిక చెప్తోంది.
- అత్యధికంగా యువత శాతం ఉన్నా, వారికి తగిన నైపుణ్యం కల్పించడంలో మన దేశం వెనుకబడి ఉంది. విద్యారంగంలో ప్రైవేటీకరణ వేగం పెరిగాక నైపుణ్య స్థాయి మరీ ఘోరంగా దిగజారింది. ఇంకోపక్క స్థాయి గల విద్యాసంస్థల ప్రమాదేశం నుండి ఒకటీ లేదు. ప్రతిష్టాత్మకమైన బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 420వ స్థానంలో ఉంది!
- ఏమిటీ కారణం? కేంద్ర మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రభుత్వ సంస్థల కు నిధ్లుల్లో కోత పెడుతోంది.
అటా నమస్గా నడుపు కోవాలని ఆదేశి స్తోంది. ప్రభుత్వ నిధులతో బాటు యూనివర్శిటీలకు రీసెర్చి ప్రాజెక్టులు ఒక ముఖ్య ఆదాయ వనరుగా ఉంటాయి. ఐతే మన యూనివర్శిటీల్లో రీసెర్చి మూలపడింది. పర్మినెంట్ అధ్యాపకులు ఉంటే వారి విధుల్లో భాగంగా రీసెర్చి ప్రాజెక్టులు చేపడతారు. మన ప్రభుత్వం పర్మినెంట్ నియామకాలకు ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు నిలదీస్తే యూనివర్శిటీలు అటానమస్ సంస్థలు కాబట్టి సొంతంగా నియామకాలు చేసుకోవచ్చునని మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధా నం ఇచ్చా రు. నిధులు లేక బక్కచిక్కిన యూని వర్శిటీలు పర్మి నెంట్ నియామ కాలు ఎలా చేసుకోగలుగుతాయి?
పైపట్టికలో ఉన్న విద్యా సంస్థల్లో సీటు రావడమంటేనే చాలా కష్టం. అలాంటి సంస్థల్లో మూడో వంతు పోస్టులు ఖాళీగా అట్టి పెట్టిన ఘనత మోడీ ప్రభు త్వానిది. ఖాళీలు నింపే బదులు కాషాయ సిద్థాంతాన్ని నింపడమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వం మన దేశ భవిష్యత్తుతో ఎంత దారుణంగా చెలగాటం ఆడుతుందో చూడండి!
మోడీ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు
