న్యూఢిల్లీ : ఆగేయ ఢిల్లీలోని రోహింగ్యాల శరణార్థి శిబిరంలో ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 వరకు తాత్కాలిక నివాసాలు దగ్ధమయ్యాయి. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజిన్లతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మదన్‌పుర్ ఖదర్ ప్రాంతంలోని కంచన్ కుంజ్‌లో ఈ శరణార్థి శిబిరం ఉంది. 230 మంది రోహింగ్యా శరణార్థులు ఈ శిబిరంలో నివసిస్తున్నట్లు మహ్మద్ షకీర్ అనే స్థానికుడు తెలిపారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని పేర్కొన్నారు.
శరణార్థి శిబిరంలో అగ్ని ప్రమాదం
