- కార్యకర్తలకు సిఎం అమరీందర్‌సింగ్ అభినందనలు
ఛండీగఢ్: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అమృత్సర్, జలంధర్, పాటియాలా మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసింది. అమృత్‌సర్‌లో 85 వార్డుల్లో 69 జలంధర్‌లో 80 వార్డుల్లో 66, పాటియాలాలో 60 వార్డుల్లో 56 వార్డుల్లో కాంగ్రెస్ విజయదుందుభి నమోదు చేసింది. ఈ విజయంపై పంజాబ్ సిఎం అమరీందర్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కొన్నిచోట్ల ఓటర్లను అకాలీ దళ్ కార్యకర్తలు బెదిరించినట్లు వార్తలొచ్చాయని, ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారని ఆయన ట్వీట్ చేశారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 29 మున్సిపల్ మండళ్లు, నగర పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరిగిందని, చెదురుమదురు ఘటనలు సహా పోలింగ్ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇవిఎంల్లో నోటా గుర్తుతో పంజాబ్‌లో జరిగిన తొలి స్థానిక ఎన్నికలు ఇవే కావడం విశేషం.
పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
