న్యూఢిల్లీ : ఓట్లు బ్యాంకు రాజకీయాలకు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే సోమవారం అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను బిజెపి ప్రకటించడంపై ఆయన స్పందిస్తూ ఓట్లు పొందేందుకు బిజెపి కులాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి తాము మద్దతివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఓట్లు పొందేందుకు దళితుడ్ని రాష్ట్రపతిగా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తే తాము వారితో ఉండబోమన్నారు. శివసేన 51వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఓటు రాజకీయాలకు కాకుండా దేశ అభివృద్ధికి ప్రయత్నిస్తే తాము మద్దతిస్తామని చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్ పేరును ఎన్డీయే తన మిత్ర పక్షాలతో చర్చించలేదని ఆయన పేర్కొన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు మద్దతివ్వం : శివసేన
