న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి వెనక్కి రప్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ నమోదైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోహినూర్‌ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రాన్ని ఆదేశించలేమనీ... అది తమ పని కాదని తేల్చిచెప్పింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రక్రియ అయినందున ఈ అంశంపై తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. దేశం వెలుపల ఉన్న ఆస్తుల వేలంపై మార్గదర్శకాలు వెలువరించలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కోహినూర్‌ను వెనక్కి రప్పించేందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నదనీ... దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోందని సుప్రీం వెల్లడించింది. దాదాపు రూ. 1.3 వేల కోట్ల విలువైన ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో పొదిగి ఉంది. టవర్ ఆఫ్ లండన్‌లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. గతేడాది ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిస్తూ.. కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ దొంగతనంగా లేదా బలవంతంగా తీసుకెళ్లలేదని తెలిపింది. పంజాబ్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చారని వెల్లడించింది.
కోహినూర్‌పై సుప్రీం నిర్ణయం....
