వైఎస్సార్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చిందని యూనిట్ చెప్పింది. 'ఆనందో బ్రహ్మ' దర్శకుడు మహి వి రాఘవ్ ఈ 'యాత్ర'ని తెరకెక్కించారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. శివ మేక సమర్పకుడు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు పార్టు సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. నిర్మాతలు విజరు చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ ' రాజశేఖర్ రెడ్డిగారి జీవితంలో అతి కీలకమైన పాదయాత్ర ఘట్టాన్ని మెయిన్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం. మమ్ముటి వైఎస్ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారనేది ఇప్పటికే ట్రైలర్స్ చూసినవారందరికీ తెలిస్తుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం' అని తెలిపారు.
ఫిబ్రవరి 8న 'యాత్ర'
