''గత నెల నా మనసుకు దగ్గరైన వాళ్లు ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్. ఎలా కనెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అలాగే మా ఆత్మీయుడు రవీందర్ రెడ్డి. ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం. మాకు సంబంధించి ఏ ఫంక్షన్ ఉన్నా ఆయన ముందుండేవారు'' అంటూ నాగార్జున వ్యాఖ్యానించారు. నాగచైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' ప్రీరిలీజ్‌లో ఆయన మాట్లాడారు.
అను ఇమ్మాన్యుయేల్ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 13న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'నాన్నకు ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైన స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఉండటాన్ని ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్ అనుకుంటారు. కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతి చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అన్ని పెద్ద హిట్స్. ఇప్పుడు తను చైతన్యకు అత్తయ్య అయింది. 'బాహుబలి' తర్వాత రమ్య అంటే ఇప్పుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను ఏ సీన్ చేసినా చక్కగా పండుతుంది. నాతో 'అల్లరి అల్లుడు' సినిమాలో చిన్న పాత్రలో నటించింది. గోపీసుందర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేరళకు సమస్యలు వచ్చినా... డేడికేషన్‌తో మంచి సాంగ్స్, రీరికార్డింగ్ ఇచ్చారు. మారుతి సినిమాలన్నీ చూస్తుంటాను. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఈయన. మా అక్కినేని అభిమానులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఈ సినిమా నిండా నవ్వులే. ఎక్కడ సాంగ్ ఉండాలి. ఎక్కడ ఫైట్ ఉండాలి. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలో తెలిసిన దర్శకుడు మారుతి. చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
నాని మాట్లాడుతూ 'చైతన్యను చూస్తే అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజారు చేసుంటాడో నాకు అర్థమవుతుంది. నేను, చైతన్య దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇంతకు ముందు జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్ని నాగార్జునకి పడితే.. ఈ జనరేషన్లో బెస్ట్ సాంగ్స్ అన్ని చైతన్యకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలు రాసి పెట్టి ఉన్నాయోమో.. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బావున్నాయి. అల్లరి అల్లుడులాంటి సినిమా అని నాగార్జున అన్నారు. ఆయన అలా అన్నారంటే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు' అని చెప్పారు.
నాగచైతన్య మాట్లాడుతూ 'అక్కినేని అభిమానులే మా బలం. వారు గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. కొత్త బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో నన్ను ప్రెజంట్ చేసిన మారుతికి థాంక్యూ సో మచ్. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ రెండేళ్ల క్రితం మరచిపోలేని సినిమా 'ప్రేమమ్' ఇచ్చారు. రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు మారుతితో మంచి కాంబినేషన్‌ను సెట్ చేశారు. రమ్య మేడమ్ నుంచి మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చింది. అందరూ ఎంజారు చేసేలా ఉంటుంది'' అని పేర్కొన్నారు.
మారుతి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు - నాగార్జున
