శషా చెట్రి, ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై యథార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథాంశంతో 'వినాయకుడు', 'విలేజ్‌లో వినాయకుడు', 'కేరింత' చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎయిర్టెల్ 4జీ ప్రకటనలో కనిపించిన అమ్మాయి శషా చెట్రి ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు. రచయిత అబ్బూరి రవి మొట్ట మొదటిసారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని పోషిస్తున్నారు. క్రిష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. కాశ్మీర్, ఢిల్లీ, విశాఖ జిల్లా లంబసింగి, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరిపారు. చిత్రీకరణ పూర్తయింది. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తున్నారు. గేరి.బిహెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు. సుబ్బు రాబిన్, నాభ యాక్షన్ కొరియోగ్రాఫ్ అందిస్తున్నారు.
ఆపరేషన్ గోల్డ్ ఫిష్
