సాయి సంహిత్ బ్యానర్‌పై ఎస్.వి.రమణ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'మన్యం'. ప్రభాకర్, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో నటించారు. ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దర్శక నిర్మాత రమణ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో కథే హీరో అన్న కాన్సెప్ట్‌తో నేను సబ్జెక్ట్‌ను రాసుకున్నాను. దాదాపు 34 సెంటర్లలో చిత్రాన్ని విడుదల చేశాను. డిస్ట్రిబ్యూటర్లు నాకు చాలా సహాయం చేశారు. హీరోయిన్ వర్ష చాలా బాగా చేశారు' అని అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ 'ముందుగా నేను ఇక్కడకి రావడానికి ప్రధాన కారణం చిన్న సినిమాలని గౌరవించాలని నా అభిప్రాయం. 'బాహుబలి'ని ఎంత కష్టపడి చేశారు. చిన్న సినిమాలు కూడా అంతే కష్టపడి చేస్తారని గుర్తించాలి. ఎందుకంటే ఏ డైరెక్టర్ పడే కష్టమైనే అంతే ఉంటుంది. పైగా ఇది ఫారెస్ట్‌ని కాపాడుకునే నేపథ్యంలో ఉన్న చిత్రం. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి' అని చెప్పారు.
'చిన్న చిత్రాల నిర్మాణంలోనూ అంతే కష్టం'
