పాత తరం నటుల్లో వరలక్ష్మి ఒకరు. తెలుగు, తమిళ చిత్రాలలో ఆమె నటి, అగ్రశ్రేణి గాయని కూడా. పౌరాణిక, జానపద చిత్రాలు ముందు పీఠికలో ఉన్నాయి. ఆనాటి నటులు కొన్ని నిబంధనలు పాటించేవారు. డబ్బు కోసం అన్నీ పాత్రలు నటించేవారు కాదు.ఆమె జీవితంలో ఎన్నో వైఫల్యాలు చవిచూసింది. సినిమా జీవితం లో చాలా వరకు కష్టాలు అనుభవించినవారే.
టి.శ్రీరామ మూర్తి, గాజువాక, విశాఖపట్నం.
అన్నీ బాగున్నాయి
సాయంత్రం 7 గంటల తరువాత చీకట్లో నడిచి వెళతుంటే కొంచెం దృష్ఠిగల వారికి దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చీకట్లో మిణుగురు పురుగులు మరికొన్ని కీటకాలు కూడా వెలుతురునిస్తాయి. క్వీన్ల్యాండ్ దేశస్తులు వీటిని ప్రదర్శించారు. ప్రతి మనిషికి దైవభక్తి ఉంటుంది. వారి వారి దైవాలను వారు ఎక్కడ నివశిస్తే అక్కడ ప్రతిష్టించుకుంటారు. సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన తార ఎస్.వరలక్ష్మి. ఏ పాత్ర వేసినా చాలా అందంగా ఉండేది. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన తత్వం ఉంటుంది. ప్రతి మనిషికి కోపం ఉంటుంది. కొన్ని రంగాలల్లో కోపాన్ని బహిర్గతం చేసి ప్రచారం చేస్తారు. యాత్రల్లో ఎన్నో రకాల యాత్రలు చూసినా రిక్షా యాత్ర చాలా ఆశ్చర్యంగా ఉంది. హిమాలయ ప్రాంతంలో రిక్షాతో యాత్ర చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. కొన్ని ప్రాంతాల్లో బహుభార్యత్వం సర్వసాధా రణం. ఎన్నికలప్పుడు ప్రజలు నాయకుల ను గట్టిగా నిలదీయాలి. స్త్రీలకు అన్నింటి లో అన్యాయమే జరుగుతుంది. మాయ వాగ్దానాలు చేసేవారు ఎన్నికైన తరువాత వారి నిజ స్వరూపం తెలుస్తుంది.
- బొడ్డేపల్లి కనకలక్ష్మి, ఆముదాలవలస.
బానిస బతుకులా?
ఆస్ట్రేలియా క్వీన్ల్యాండ్లో హిందూ దేవాలయ వైభవం, టూంబొరిన్ కొండ గుహల్లో మిణుగురు పురుగులు ప్రసరి స్తున్న వింత కాంతులు ఆశ్చర్య పరిచాయి. తీవ్రమైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతూ మరోపక్క పరుగు పందెంలో పాల్గొంటూ జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిన కెయిలా క్రీడాస్ఫూర్తి వర్థమాన క్రీడాకారులకి ఆదర్శనీయం. అడవులు, కొండలు, లోయలు, కఠోరమైన రహదా రుల గుండా కేవలం రిక్షానే ఆధారం చేసుకొని 68 రోజుల్లో 3000 కిలోమీటర్లు ఒంటరి ప్రయాణం సాగించిన సత్యేన్ దాస్ నిజంగా ధీరోధాత్తుడు. కేరళ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గజరాజు అద్దె 4.5 లక్షల రూపాయలు పలకడం వాటి వైభోగానికి నిదర్శనం. మహారాష్ట్రలో డెంగన్మాల్ అనే గ్రామంలో నేటికీ బహుభార్యత్వం, బానిస బతుకులు సాగుతున్నా ప్రభుత్వాలు, ప్రజలు, సంఘసంస్కర్తలు నోళ్ళు మెదపకపోవడం మన సమాజం చేసుకున్న దౌర్భాగ్యం.
- టి. సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం
సముద్ర రాణి చాలా బాగుంది
పురాతన కట్టడాలు, కేరళ అందాలు, సముద్రపు అందాలు, కళలు ప్రార్థన మందిరాలు ఇంకా చూడవలసిన ప్రదే శాలు గురించి ఎంతో విపులంగా వివరి ంచారు. ఇంకా మరిన్ని ప్రదేశాలు గురించి ఆసక్తిగా ఎదరుచుస్తున్నాం.
- దేవ ప్రియం, జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా (ఈ-మెయిల్)