న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ తొలిరోజు అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో రికార్డు స్థాయిలో జరిగాయట. మార్చి15 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోనును అమ్మకానికి ఉంచింది. సగటున నిమిషానికి 50 ఫోన్లు వరకూ విక్రయమయ్యాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఆఫర్లతో వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందట. పాత మోటో ఫోన్లును ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అమ్మకాలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకూ 4వేల మంది తమ పాత మోటో ఫోన్లును ఇచ్చేసి మోటో జీ5 ప్లస్‌ను కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ ఫోన్‌కు బైబ్యాక్ ఆఫర్కూడా అందుబాటులో ఉంది. కొనుగోలు చేసిన ఆర్నెల్లలోపు ఫోన్ నచ్చకపోతే తిరిగి అమ్మేయొచ్చు. దీనికి రూ.7వేల వరకూ చెల్లిస్తారు. అదే మార్చి31 లోపు అయితే రూ.13,500 ఇవ్వనున్నారు.
మోటో జీ5 ప్లస్ ప్రత్యేకతలు
* 5.2 అంగుళాల తాకే తెర
* 2 గిగాహెడ్జ్ ప్రాసెసర్
* అడ్వాన్స్డ్ 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.