ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌కు లీగల్ అడ్వైజర్‌గా నందిగామకు చెందిన న్యాయవాది షేక్ కరిముల్లా ఎన్నికయ్యారు. న్యాయవాది, సేవాతత్పరుడిగా షేక్ కరిముల్లా సేవలను గుర్తించి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హజరత్ అల్లాఫ్ బాబా కొండపల్లివారు కరిముల్లాను ఎన్నుకు న్నారు. ఈ సందర్బంగా శుక్రవారం కరిముల్లా మాట్లాడుతూ ముస్లిములు అత్యంత దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారని, రిజర్వేషన్లు పెంచాలని కోరారు. అలాగే ముస్లిముల సంక్షేమానికి, వారి అభివృద్దికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. తన నియామకపత్రాన్ని అజ్మీర్ పీఠాధిపతి హజరత్ పీర్ సూఫీ అజ్మీరి, సెంట్రల్ బోర్డు సెక్రటరీ డాక్టర్ రియాజుద్దీన్ అల్లాఫ్భాబా చేతుల మీదగా అందుకున్నట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ముస్లీం మత గురువులు, తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర లీగల్ అడ్వైజర్‌గా కరిముల్లా
