నూతన రాజకీయ ప్రత్యామ్నానికై సిపిఎం, సిపిఐ మహాగర్జనను విజయవంత చేయాలని కోరుతూ చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిసిఎం రాష్ట్ర నాయకులు పిన్నమనేని మురళీ కృష్ణ పిలుపు నిచ్చారు. బస్సు యాత్ర నేడు కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్లోకి ప్రవేశించనున్న నేపద్యంలో ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కార్యకర్తలు,నాయకులతో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు,ట్రాన్స్‌పోర్టు కార్మికుల సంఘం నాయకులు ముజఫర్ అహ్మద్,సిపిఎం మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు,మండల కమిటీ సభ్యులు,పార్టీ కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు. నందిగామలోని స్థానిక సుందరయ్య భవన్లో నందిగామ, చందర్లపాడు మండలాల సిపిఎం కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం పశ్చిమకృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ మాట్లాడారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమోలు సైదులు, కార్యదర్శి కటారపు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఖాసిమ్, ఆదూరి సుశీల, వేల్పుల ఏసోబు, హస్సేన్, భండారు వినాయకరావు, వి.రవిశేఖర్, తెప్పటి కోటేశ్వరరావు, సుజాత పాల్గొన్నారు. డివిఆర్ కాలనీలో సిపిఎం నాయకులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణి చేశారు. సిపిఎం మండల కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడారు. ప్రజా సంఘాల నాయకులు తెప్పలి కోటేశ్వరరావు, నారాయణ, బత్తుల వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, శ్రీను, రోశయ్య పాల్గొన్నారు. చందర్లపాడులో సిపిఎం నాయకులు వేల్పుల ఏసోబు, ఎస్కె అస్పాన్ మహాగర్జనను విజయవంతం చేయాలని కోరారు. పొక్కునూరు గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశారు. బిల్డింగ్ , ఆటో , వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. నూజివీడులో స్థానిక సిపిఎం పట్టణ కార్యాలయంలో జరిగిన సిపిఎం, సిపిఐ, జనసేన నాయకుల సమావేశంలో సిపిఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి జి.రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఉన్నం అనిల్ కుమార్, జనసేన నాయకులు సుజాత, కాంతారావు పాల్గొన్నారు. సోమవారం జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి రాజు, మండల కార్యదర్శి చిటికల రామారావు కోరారు. పెడనలో పట్టణంలోని బ్రహ్మపురం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ప్రచార జాతా నిర్వహించారు. బ్రహ్మపురం, వైఎస్ఆర్ కాలనీ, కొత్తపేట, రామలక్ష్మీ కాలనీ, పడమటతాళ్లు, గుడివాడ రోడ్డు, పాతపేట, మఠం వీధి, పోలవరపుపేట, బస్టాండ్ సెంటర్, చోడిదిక్కుల, కాపుల బజారు, వీరభద్రపురం, జోగానందరావు కాలనీ, మగ్గయ్య కాలనీ, తోటమూల ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. సిపిఎం నాయకులు సజ్జా నాగేశ్వరరావు మాట్లాడారు. సిపిఎం నాయకులు సజ్జా మూర్తిరాజు, పంచల నరసింహారావు, గోరు రాజు, వాసా గంగాధరరావు, మురళీ, సిపిఐ నాయకులు కట్టా హేమసుందరరావు, పేరిశెట్టి ఉమాకాంతం, కుర్మా కోటేశ్వరరావు, ప్రభాకరరావు, బూసం మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఉంగుటూరు(హనుమాన్‌జంక్షన్)లో స్థానిక సిఐటియు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
నూతన రాజకీయ ప్రత్యామ్నానికై సిపిఎం,సిపిఐ మహాగర్జనను విజయవంత చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పిన్నమనేని మురళీ కృష్ణ మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు,ట్రాన్స్‌పోర్టు కార్మికుల సంఘం నాయకులు ముజఫర్ అహ్మద్,సిపిఎం మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు,మండల కమిటీ సభ్యులు,పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
మహాగర్జనను విజయవంతం చేయాలి
