ప్రజాశక్తి-జగ్గయ్యపేటరూరల్
మండలంలోని చిల్లకల్లులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రెవ.ఫిలిప్ తనయుడు డాక్టర్ రెవ. జయపాల్ విదేశాల్లో, అలాగే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన సుమారు 200 రకాల ఔషధ మొక్కలను సేకరించారు. వీటిని సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో తన ఇంటి ప్రాంగణంలో నాటి పెంచుతున్నారు. ఈ మొక్కలు ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్డటమే కాకుండా యువతులను, విద్యావంతులను, ప్రకృతిని ప్రేమించే వన మిత్రులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ జయపాల్ మాట్లాడుతూ కనుమరుగవుతున్న ప్రపంచ అరుదైన వృక్ష జాతులను తీసుకువచ్చి తమ గ్రామంలో ఒక గొప్ప ఉద్యానవనంగా నెలకొల్పి ఆధునిక సమాజానికి ప్రకృతి సందేశం తెలపాలని, ఔషధమొక్కలను అధ్యయనం చేయాలని సంకల్పంతో వున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వృక్షశాస్త్ర పరిశోధకులు అబ్బాసాలి ఔషధమొక్కలను పరిశీలించి జయపాల్ను అభినందించారు.
ఇల్లే ఓ ఉద్యానవనం
