ఫ్రెండ్స్! మీకు ఇంట్లో వర్షం పడుతున్నప్పుడు ఆడుకోవడానికి బయటకు వెళ్లడం కుదరదు కదా! అప్పుడు మీకు బోర్ కొడుతుంది కాబట్టి, అలా మీరు ఖాళీగా ఉంటే ఏం తోచదు అందుకని, ఇంట్లో మీకు టైమ్‌పాస్ కోసం అవసరం లేని ప్లాస్టిక్ బాటిళ్లతో మనం ఇంట్లో అలంకరించుకోవడానికి ఒక వస్తువుని తయారు చేసుకుందాం. సరేనా! అయితే, ఇప్పుడు ఆ వస్తువుకు కావల్సినవి ఏమిటో చూద్దాం.
కావల్సినవి : ప్లాస్టిక్ వాటర్ బాటిల్ - 4, కత్తెర -1, ఫెవిస్టిక్ - 1, పేపర్ - 3, ప్లాస్టిక్ గ్లాస్ -1, ఇసుక - గ్లాసుకు సరిపడా, పచ్చరంగు నీరు - ఒక చిన్న గ్లాస్, టేపు - 1
తయారు చేసే విధానం:
ముందుగా వాటర్ బాటిల్‌ను తీసుకుని వాటిని మధ్యలోకి కత్తిరించుకోవాలి. తర్వాత కత్తిరించిన దాన్ని నిలువుగా మధ్యలోకి కత్తిరించుకుని ఆకు షేపు వచ్చేలా చూసుకోవాలి. దానిని చిన్న చిన్నగా కొబ్బరి ఆకుల్లా కత్తిరించి మధ్యలో ఆకుల్ని తీసేయాలి. బొమ్మలో చూపించిన విధంగా. ఇప్పుడు అలా కొన్ని ఆకుల్ని తయారు చేసుకుని, ఇప్పుడు పేపర్లను ఒకదాని తర్వాత ఒకటి లావుగా చుట్టుకోవాలి. అలా చుటుకున్న తర్వాత అవి విడిపోకుండా గ్రీన్ కలర్ టేపుతో వాటిని అంటించుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్ మధ్యలో మనం తయారు చేసుకున్న ప్లాస్టిక్ ఆకులను ఒకదాని తర్వాత ఒకటి చెట్టులా పెట్టుకుని వాటికి ఫెవిస్టిక్తో దగ్గరగా అంటించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాని నిండుగా ఇసుకతో నింపి ఆకులను దానిలో పెట్టాలి. తర్వాత ఆ ఇసుకలో పచ్చరంగు నీరు పోస్తే అందంగా కనిపిస్తుంది. మనం కావాలంటే, పైన మెరుపులతో కూడా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు అందమైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ చెట్టు రెడీ.
బాటిల్‌తో చెట్టు
