ఏటిలోని గల గలలు లేవని, రావని
తడి ఆరిన గొంతుక తల్లడిల్లుతున్నది..!!
మనిషి ధరణిపై దండయాత్ర చేస్తుంటే
తల్లి మనసు తల్లడిల్లి కన్నీరు కారుస్తుంటే..!!
తల్లి కన్నీటితో దేహం
దాహం తీర్చుకుంటున్నాము
కదిలిపోయే కాలంలో
కలసిపోయే కాలంలో
కలసిపోయే నీకు..!!
తల్లి గాయాల వేదనల
రోదనలు కనిపించవా..!!
నీరించిన భ్రష్ట్రమాతను
కాటేయకురా..!!
గంగమ్మ గల గలలు
సాగనివ్వర...!!
ఆక్రమించకు వాగు- వంకలు,
చెరువు-కుంటలు..!!
ధరణి గంగతో నిండినప్పుడే
మనిషి జీవన ప్రయాణం
కొనసాగును కదా..!!
-అఖిలాశ
07259511956
నీరు
