సమస్యాత్మక కేంద్రాలను గుర్తించండి
తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
జిల్లాలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం నియోజకవర్గాలలో పోలింగు కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగు కేంద్రాల వివరాల జాబితాను పక్కగా పరిశీలించి 100 శాతం పంపాలని కలెక్టరు ఎస్.సత్యనారాయణ సెక్టోరియల్ అధికారులను, తహశీల్దార్లను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేటు నుంచి పోలింగ్ కేంద్రాల జాబితాపై కలెక్టరు, జెసి పఠాన్ శెట్టి
రవిసుభాష్, ఎఎస్పి మాధవ రెడ్డితో కలిసి జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు క్యూలో వెళ్లి ఓటు వేసేందుకు అనుకూలంగా వున్నాయా లేదా మరో సారి పరిశీలించి జాబితాను తక్షణమే వెబ్ సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగు కేంద్రాల పట్ల రెవెన్యూ, పోలీసులు కలిసి జాబితా పక్కగా రూపొందిం చాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తావున్నారు. సమాచారం కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో సోన్, ఫ్యాక్స్ మిషన్ ఏర్పాటుకు ముందస్తుగా సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. పోలింగ్ లొకేషన్ వారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానున్నారు. పొలిటికల్ వాయిలెన్స్, ఓటింగుకు రాని గ్రామాలను గుర్తించాలన్నారు. రానున్న ఎన్నికల సందర్భంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు తహశీల్దార్లు, పోలీసులు జాబితా రూపొందించి పంపాలన్నారు. బిఎల్ఓల పేర్లు, సెల్ నెంబర్లు ప్రతి పోలింగు కేంద్రం సిద్ధం చేసి వుంచాలన్నారు. ఆదోని, నంద్యాల ఆర్డిఒ కార్యాలయాలలో ఇవిఎంలు ఏర్పాటు చేసి వివిధ రాజకీయ పార్టీల వారికి అవగాహన కల్పిస్తామన్నారు. ఆనంతరం కలెక్టరేట్ సమీపంలో ఇవిఎంల గోడౌను, శ్రీనివాస ఇంజినీరు కాలేజీ దగ్గర వున్న ఇవి ప్యాడ్ గోడౌను జిల్లా కలెక్టరు, జెసి, వివిధ పార్టీల ప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమంలో డిఆర్ఒ వెంకటేశం, జిడి డిప్యూటీ సిఇఒ చంద్ర శేఖరరెడ్డి , వికలాంగుల సంక్షేమ శాఖ ఎడి భాస్కర రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ , ఉప కార్యనిర్వాహక సమాచాల ఇంజనీరు బాలకొండయ్య, డిఎస్పీ రమణమూర్తి, సిఐ ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవిఎం, వివి ప్యాట్స్పై అవగహన :- సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా లక్ష్మీపురంలో ఉన్న శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం ఇవిఎం, వివి ప్యాట్స్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధుల చేతుల మీదుగా ఇవిం, వివి ప్యాట్స్లను గోదాము నుంచి బయటికి తీయించారు. వారు తీసిన నెంబర్లు గల ఇవిఎం, వివి ప్యాట్స్ లను శిక్షణా నిమిత్తం కర్నూలు 10, నంద్యాల 10, ఆదోని లకు10 చొప్పున పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. తొలుత బెల్ కంపెనీ ఇంజినీర్లు ఇవిఎం, వివి ప్యాట్స్ల వాడకంపై శిక్షణ ఇస్తారని, ఈ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీర్స్ మండల స్థాయిలో శిక్షణ ఇస్తారని చెప్పారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఇక్కడ తీసిన నెంబర్లు గల ఇవిఎం, వివి ప్యాట్స్ లను శిక్షణా కార్యక్రమానికి ఉపయోగిస్తామన్నారు. శిక్షణ జరుగుతున్న సమయంలో ఏ రాజకీయ పార్టీల ప్రతినిధులైన తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జెసి పఠాన్ శెట్టి రవి సుభాష్, డిఆర్వో వెంకటేశం, ఎన్నికల డిటి రాజు పాల్గొన్నారు.
సమస్యాత్మక కేంద్రాలను గుర్తించండి
