పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాలు వివరిస్తూ, ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయ విధానాల ఆవశ్యకత అవసరం తెలియజేస్తూ చేపట్టిన సైకిల్ యాత్రను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెరగడానికి ఈ కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేసి అందరికి అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కన్సల్టెంట్, డిజిటల్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ప్రాజెక్ట్ ఇన్ఛార్జి ప్రదీప్ కరుటూరి, ఎపి జన్మభూమి వాలంటీర్, ప్రకృతి రైతులు అమర్, అక్బర్లు సైకిల్ యాత్రగా కర్నూలు జిల్లాలో మొదలై శ్రీకాకుళం జిల్లా వరకు 2000 కిలోమీటర్లు 13 జిల్లాలు తిరిగి డాక్యుమెంటేషన్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఉపయోగాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా తెలుసుకొంటూ, భవిష్యత్లో ప్రవాసాంధ్రులు ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవచ్చనే విలువైన సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిఇఒ తాహెరాసుల్తానాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్
