ప్రజాశక్తి - యర్రగుంట్ల రూరల్
గర్భిణులు, చిన్న పిల్లలకు తప్పని సరిగా పౌష్టిక ఆహారం అందేలా చూడాలని మండల ప్రత్యేక అధికారి మధు సూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కలమల్ల గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా కళాకారులు పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం, ప్రభుత్వ పథకాలు వాటి ప్రయోజనాల గురించి పాటల రూపంలో ప్రజ లకు వినిపించారు. అనంతరం ప్రత్యేక అధికారి సాధికార మిత్రలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంగన్వాడి స్కూల్లో ఈనెల 1వ తేదీ నుంచి గుడ్లు రావడంలేదని ప్రత్యేక అధికారికి అంగన్వాడీ టీచర్లు తెలియజేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో అధికారులంతా పర్యటించి గ్రామంలోని సమస్యలను కనుగొన్నారు. నీటిని వృథాగా రోడ్లమీద పడేస్తే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రజలు గ్రామ సమస్యలపై వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శివకుమారి, ఎంఎఒ అరుణ, పశువైద్యాధికారి శ్రీధర్ రెడ్డి, ఎపిఒ హరికృష్ణ, ఐసిడిఎస్ కళావతి, ఎపిఎం అపర్ణ, మాజీ సర్పంచ్ నారాయణ, ఎంపిటిసి నాగమని, హౌసింగ్ ఎఇ గోపాల్‌రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రెటరీ రియాజుద్దీన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందేలా చూడాలి
