ప్రజాశక్తి - కల్చరల్
ప్రతినెల టిక్కెట్టుపై నాటక ప్రదర్శన అనే నినాదాన్ని ఉద్యమంగా చేపట్టిన రసరంజని నాట క సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శ్రీత్యాగ రాయ గానసభలో తెలుగు భారతి సాంస్కృతిక సంస్థచే థర్మవరపు గోపాలచార్య రచించిన 'రామదాసు' పద్యనాటకం మాధవపెద్ది వేణుగోపాల కృష్ణ దర్శకత్వంలో ప్రదర్శితమైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేల కొండపల్లి గ్రామస్తుడైన కంచర్ల గోపన్న రామభక్తితో తహశీల్దారుగా పదవిలో ఉన్న కాలంలో భద్రాద్రి కొండపై రామాలయా న్ని నర్మించడం నవాబు తానీష పన్నులు దుర్విని యోగం చేసినందుకు జైలు శిక్ష విధించడం రామలక్షణులు మారురూపంలో తానేష వద్దకు వచ్చి శిస్తు ధనం చెల్లించడం వంటి ఘట్టాలతో పూర్తి ఆసక్తికరంగా నాటకం మలచబడింది. రామదాసు పాత్రలో వేణుగోపాలకృష్ణ భార్య కమ లగా, సురభి వెంగమాంబ, సమర్థవం తమైన నటన ప్రదర్శించారు. తానేషగా సుబ్బారా యుడు, రామదాసు కుమారుడుగా దేవి వరప్ర సాద్, కబీర్‌గా పుల్లారావు నటన ప్రశంసనీయం.