- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో 33 పోస్టులు
విజయవాడ (ఏపీ)లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ 2017, ఫిబ్రవరి 23న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ప్రస్తుత ప్రకటన విడుదల చేసింది.
ప్లానింగ్ విభాగం :
పోస్టులు: ప్రొఫెసర్-1, అసోసియేట్ ప్రొఫెసర్-2, అసిస్టెంట్ ప్రొఫెసర్-4
అర్హత: ఆర్కిటెక్చర్/ ప్లానింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, ప్లానింగ్‌లో మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.
ఆర్కిటెక్చర్ విభాగం : ప్రొఫెసర్-4, అసోసియేట్ ప్రొఫెసర్-9, అసిస్టెంట్ ప్రొఫెసర్-13
అర్హత: ఆర్కిటెక్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ పద్ధతిలో. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తాజా సమాచారాన్ని పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 6, 2018.
మరిన్ని వివరాలు: వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్:www.spav.ac.in
ఉద్యోగాలు
