జహీరాబాద్‌కు ప్రయాణం

Mar 10,2024 07:40 #chirumuvallu, #Sneha

నేను నా మిత్రులతో కలిసి, కొంతమంది ఉపాధ్యాయులతో ఫిబ్రవరి నెలలో జహీరాబాద్‌కు వెళ్లాం. 9వ తేది విజయవాడ నుండి రాత్రి 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరాము. ఈ ప్రయాణం మాకు ఒక మధుర జ్ఞాపకం. మేము రైలులో వెళ్లేటప్పుడు నెమళ్లను చూసాము. జహీరాబాద్‌ కు తర్వాత రోజు ఉదయం 10:30 కు చేరుకున్నాము. శ్రీను సార్‌తో ప్రగతి నర్సింగ్‌ హోమ్‌కు చేరుకున్నాము. అక్కడికి వెళ్లాక మేము ఫ్రెష్‌ అయ్యి టిఫిన్‌ చేసిన తర్వాత డిడిఎస్‌ (డెక్కన్‌ డెవలప్మెంట్‌ సీడ్స్‌) రేడియో స్టేషన్‌ ద్వారా కొన్ని మాటలు విన్నాము. దాని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రేడియోని 1999లో తయారు చేశారు. ఈ రేడియో స్టేషన్‌ ప్రవీణ్‌ గారు 2008లో డెవలప్మెంట్‌ చేశారు. ఆయన తర్వాత ఆ రేడియో స్టేషన్‌ను పుల్లమ్మ గారు నడిపించారు. ఆమె చదువుకోకపోయినప్పటికీ ఆ రేడియో స్టేషన్‌ని ఎంతో చాకచక్యంగా నడిపారు.


పక్కనే ఒక పాఠశాలను చూశాము. ఆ పాఠశాల చాలా పురాతన కాలంలో నిర్మించారు. ఆ పాఠశాల చూడడానికి ఇగ్లూ లాగా అనిపించింది. మాకు ఆ పాఠశాల భలే నచ్చింది. తర్వాత గెస్ట్‌ హౌస్‌ కి వెళ్ళాము. అక్కడ భోజనం చేశాము. శ్రేష్టమైన బెల్లం తయారుచేయడం చూశాము. గెస్ట్‌ హౌస్‌లో చాలా విత్తనాలను చూశాము. కొన్ని విత్తనాలను మా పాఠశాలకు తెచ్చుకున్నాము. మేము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్‌ కోటకు వెళ్ళాం. అది ఆ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కోట. అది చాలా ప్రసిద్ధి చెందింది. అది కొండ రాళ్ళచే నిర్మించబడింది. నాకు ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకం. తర్వాత మేము పడేల్‌ తండా వెళ్ళాము. అక్కడ ఒక రాత్రి ఉన్నాము. అది గ్రామంలోని ఇల్లు కొండ రాళ్లతో కట్టబడ్డాయి. అక్కడ 120 కుటుంబాల వరకు ఉన్నాయి. డాక్టర్‌ విజయలక్ష్మి గారు నిర్వహించే హ్యాపీ సండేకు హాజరయ్యి అక్కడ పిల్లలతో ఆడాము. మాకు తెలిసిన క్రాఫ్ట్‌ నేర్పించాము. ఇలా మా జహీరాబాద్‌ ప్రయాణం ఎంతో విజ్ఞానవంతంగా జరిగింది.

 

– ఎం. మేరి,9వ తరగతి జాస్మిన్‌,

అరవింద హైస్కూల్‌, కుంచనపల్లి,గుంటూరు జిల్లా.

➡️