యువత తలచుకుంటే దేన్నైనా సాధించగలరు. నేటి పోటీ ప్రపంచంలో చదువులో పోటీ బాగా పెరిగింది. అయినప్పటికీ తమ మేధాశక్తికి పదును పెట్టి సునాయాసంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. తమ సత్తా చాటుకుంటున్నారు.. దీనిలో భాగంగానే లిబ్సన్లో కొద్దిరోజుల క్రితం 2018 ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ పోటీలు జరిగాయి. ఇండియా నుంచి ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ ఐదుగురు 21 సంవత్సరాల తర్వాత మళ్లీ స్వర్ణపతకాలతో తిరిగి వచ్చారు. చైనాతో కలిపి మొత్తం 87 దేశాలు ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్నాయి.
ముంబయి నుంచి భాస్కర్‌గుప్తా, కోట నుంచి లే జైన్, రాజకోట్ నుంచి నిషాంత్ అభంగి, జైపూర్ నుంచి పవన్ ఘోయల్, కోల్కత్తా నుంచి సిద్ధార్థ్ తివారి ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం 396 మంది విద్యార్థుల్ని ఎంపిక చేశారు. దీనిలో 42 మంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నారు. హోమీబాబా సెంటర్ సైన్స్ ఎడ్యుకేషన్ సైంటిస్ట్ ప్రవీణ్ పాఠక్ అంతర్జాతీయ జట్టుకు నాయకత్వం వహించారు. ఈ సంవత్సరం ఇండియా జట్టు అనూహ్యమైన రీతిలో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విషయాన్ని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ఆర్) ఇంటర్నేషనల్ టీం తెలిపింది.
''మేమంతా ఈ పోటీల్లో 1998 నుంచే పాల్గొంటున్నాం. గతంలో మూడుసార్లు నాలుగు స్వర్ణ పతకాలు, ఒక వెండి పతకాన్ని దక్కించుకున్నాం. పాల్గొన్న వారంతా స్వర్ణపతకాలు సాధించడం మాత్రం ఇదే మొదటిసారి' అని సంతోషంగా చెప్పాడు పాఠక్. జైన్, గోయల్ జెయియి టాప్ 10 ర్యాంకర్స్‌లో ఉన్నారు. వీరిలో ముగ్గురిని ముంబయి ఐఐటికి ఎంపిక చేశారు. జైన్ ఎంఐటి యుఎస్ జాయింట్ కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ కోర్సుకి, అభంగి ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతూ జెయియి అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. 'దీనిలో ప్రయోగాత్మక అంశం చాలా కష్టమైనది. సైద్ధాంతిక పరీక్ష కొంచెం సులభంగానే ఉంటుంది. ఈ ముగ్గురూ అత్యధిక మార్కులు సాధించారు' అని సైన్స్ ఒలింపియాడ్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు గోయల్. ఈ ఐదుగురు రిగోరస్ సెలక్షన్ ప్రోసెస్‌లో హోమీ బాబా సెంటర్ నుంచి ఎంపికయ్యారు. వీరిని కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
్య
సైన్స్ ఒలింపియాడ్‌లో స్వర్ణం
