చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చి పెద్ద వ్యాపారవేత్తగా మారి, కృషి ఉంటే విజయాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదని 'స్వయంకృషి' సినిమాలో హీరో నిరూపించాడు. ఇప్పుడు ఆ స్వయంకృషి సినిమా గురించి ఎందుకు ప్రస్తావించారు అనుకుంటున్నారు కదా! స్వయంకృషిలో హీరో పోషించింది కేవలం పాత్రే. కానీ, నిజజీవితంలో చెప్పులను కుట్టుకునే స్థాయి నుంచి ఓ పెద్ద కంపెనీకి యజమానిగా మారి, ఆ చెప్పులను విదేశాలకు ఎగుమతి చేసేంత స్థాయికి వెళ్ళిన ఆమె విజయగాథ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఎవరో? ఆ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న ఆమె స్వయంకృషి ఏంటో తెలుసుకుందాం!
స్వయంకృషి అందించిన విజయం!
