సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కొత్త సంవత్సరం తొలి మాసంలోనే దుమ్మురేపారు. కొత్త ఆల్బమ్‌లు, లైవ్ షోలతో అదరగొట్టారు. తుఫాను బాధితుల సహాయర్థం 'మనసా పదా' (నిన్జే ఏజూ) అంటూ లైవ్ మ్యూజిక్ షోలు నిర్వహించి తమిళనాట సంగీత సెలయేళ్లు పారించారు. సరిగమల తుఫానుతో తమిళ తంబీల్లో సంతోషం నింపారు. జనవరి తన వారసడు ఏఆర్ అమీన్నూ పరిచయం చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఓకే బంగారం చిత్రంలో 'మౌలా వా సలీం' ఖురాన్ గీతాన్ని ఆలపించి అదరగొట్టిన అమీన్ తండ్రితో కలిసి లైవ్ షోల్లోనూ శభాష్ అనిపించారు. జనవరిలో చెన్నరు, కోయంబత్తూరు, మధురైలలో నిర్వహించిన ఈ సంగీతోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా లగాన్‌లో సూపర్‌డూపర్ హిట్సాంగ్ 'గణణ గణణ' పాటను కొత్త రాగాలతో మళ్లీ విడుదల చేశారు. ఈ ఆల్బమ్ విడుదలైన కొద్దిరోజుల్లోనూ యూట్యూబ్‌లో లక్షలాది వీక్షకులతో అగ్రశ్రేణిలో నిలిచింది.